గత రెండు, మూడు రోజులుగా సిద్దిపేట పట్టణం లో కురిసిన భారీ వర్షాలకు కోమటి చెరువు నాలా వరద ఉదృతికి గురైన ముంపు ప్రాంతాలు అయిన శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస్ నగర్ ప్రాంతాల్లో గురువారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. క్షేత్ర స్థాయి లో పర్యటించి చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ను, మున్సిపల్ అధికారులను హరీష్ రావు ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో బయకు ఎవరు రావొద్దని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెండొద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.