రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని రుద్రంగి మండలంలోని పల్లె ప్రకృతి వనం సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహాన్ని అటుగా వెళ్లే గొర్రెల కాపరులు గుర్తించారు. ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా,మృతుడు చెట్టుకు ఉరేసుకుని ఉన్నాడని, మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమయిందని కాపరులు గురువారం పేర్కొన్నారు.