వాయువ్య బంగాళాఖాతంలో ఒడిస్సా పశ్చిమబెంగాల్ తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు మంగళవారం విశాఖ వాతావరణ శాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ వాయువ దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందన్నారు దీని ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు నుంచి అతి భారీ వర్షాలు పడతాయి అన్నారు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ప్రజల అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు