మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకర బోర్డ్ ప్రాంతంలో మహబూబాబాద్ తొరూర్ ప్రధాన రహదారిపై యూరియా అందించాలంటూ సోమవారం ఉదయం 11:00 లకు రైతులు రాస్తారోకో చేపట్టారు. గత కొన్ని రోజులుగా యూరియా కోసం క్యూ లైన్ లో నిలిచిన ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. అధికారులు ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమని, తమ పంటలు పండించుకోవాలంటే యూరియా అవసరమని, వీడియో లేకపోవడంతో పంటలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రాస్తారోకో చేపట్టడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ సమస్య నెలకొంది