పేదల ఆర్థిక సాధికారతకు పీ-4 సర్వే: జడ్పీ సీఈవో..పేదరికం లేకుండా సమాజాన్ని సృష్టించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో (P4) సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని జడ్పీటీసి నాసర రెడ్డి మంగళవారం నందవరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, టీడీపీ మండల నాయకులతో సమావేశంలో చెప్పారు. దారిద్రరేఖకు దిగువన ఉన్నవారిని గుర్తించి సహాయం చేయడం సర్వే ప్రధాన ఉద్దేశమని, ప్రజాభిప్రాయ సేకరణలో అందరి భాగస్వామ్యం అవసరమని అభిప్రాయపడ్డారు.