రోడ్డు ప్రమాదంలో విద్యార్థి కి తీవ్రగాయాలు రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టి విద్యార్థి పరిస్థితి విషమించిన సంఘటన శనివారం అర్ధరాత్రి అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలంలో జరిగింది. తాలుకా పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, ఈడిగపల్లెకు చెందిన రైతు శ్రీనివాసులు కొడుకు గౌతమ్(19) మదనపల్లె లోని ఓకళాశాలలో ఇంటర్ చదువు తున్నాడు. మదనపల్లె నుండి బైక్ లో ఇంటికి అర్థరాత్రి వెళుతుండగా, మార్గ మధ్యంలోని గ్రీన్ వ్యాలి స్కూల్ సమీపంలోని డాబా వద్ద రోడ్డుపై నిలిపి ఉన్న లారిని గౌతమ్ బైక్ తో ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. బాదితున్ని వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.