కాకినాడ జిల్లా పెద్దాపురం పట్నం స్థానిక యాసలపు సూర్యారావు భవనం నందు, ఆదివారం ఉదయం సిపిఎం నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నేలపాల సూరిబాబు మాట్లాడుతూ, ఎంతోకాలంగా వంద పడకల ఏరియా హాస్పిటల్ కొరకు పెద్దాపురం ప్రజలు ఎదురుచూస్తూ ఉంటే దానిని ప్రైవేటు వ్యక్తులతో నిర్వహిస్తామని సీఎం చెప్పడం, ప్రభుత్వ ఆస్పత్రి ప్రైవేట్ వారి చేతుల్లో పెట్టడమే అని విమర్శించారు. మంచినీటి సమస్యల మీద మాట్లాడుతూ మంచినీటిని ఏలూరు నుండి అందచేస్తామని ప్రకటన చేశారని దానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు అని తెలిపారు.