తూర్పుకోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విశాఖ బీచ్ రోడ్ లో యోగాంధ్ర పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా వారిని అనుసరిస్తూ శనివారం ఉదయం 6 గంటలకు రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే క్రీడా మైదానంలో వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రా ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులంతా యోగాసనాలు వేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో యోగా కార్యక్రమంలో పాల్గొనడం ఆయనతోపాటు తాము కూడా రైల్వే ప్రాంగణంలో ఉద్యోగంతా యోగా చేయడం ప్రపంచ రికార్డు సాధించడం చాలా సంతోషంగా ఉందని డిఆర్ఎం లలిత్ బొహ్రా తెలిపారు.