గర్భిణీ స్త్రీలకు స్కాన్ చేసే సమయంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రేపల్లె ఆర్డిఓ రామలక్ష్మి హెచ్చరించారు. రేపల్లె ఆర్డిఓ కార్యాలయంలో గురువారం స్కానింగ్ సెంటర్ల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయం తెలిపారు. టీనేజ్ బాలికలకు సరైన నడవడికపై కౌన్సిలింగ్ ఇవ్వాలని, స్కానింగ్ సెంటర్లపై డెకరేట్ ఆపరేషన్ నిర్వహించాలని వైద్యులకు సూచించారు.