విద్యార్థులు యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ వికలాంగుల శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాపై వోక్సన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కంపోల్ విద్యార్థిని విద్యార్థులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ ఎన్ డి పి ఎస్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వోక్సన్ యూనివర్సిటీ బృందం తో పాటు ఆఫీసర్లు విద్యార్థులు పాల్గొన్నారు.