బషీర్ బాగ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు రేణుక (50) మృతి చెందింది. గుడిమల్కాపూర్కు చెందిన రేణుక 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పనిచేస్తుంది. ఇవాళ ఉదయం బషీర్ బాగ్–లిబర్టీ మార్గంలో విధుల్లో ఉండగా రోడ్డు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు వాహనం కిందపడింది. తలకు తీవ్రగాయం కావడంతో ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయింది. పోలీసులు డ్రైవర్ గజానంద్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.