మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం వద్ద గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని లారీ డ్రైవర్ దుర్మరణం చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు.