సోలాం అకాడమీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న రోబోట్స్ ఎడ్యుకేషన్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని సప్తగిరి కాలనీ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులు ప్రదర్శించిన రోబోటిక్స్ ప్రయోగాలను కలెక్టర్ శనివారం పరిశీలించారు. జిల్లాలోని 15 ప్రభుత్వ పాఠశాలలో రోబోటిక్స్ ఎడ్యుకేషన్ ను ఉచితంగా ఉచితంగా అందిస్తున్నారని, థియరీ తో పాటు ప్రయోగాత్మకంగా నిజజీవితంలో రోబోట్స్ ను తయారు చేయడం, వినియోగించడం పై పాఠాలు నేర్పుతున్నారని తెలిపారు. రోబోట్స్ విద్య నేర్చుకుంటున్న బాలికలతో స్వయంగా మాట్లాడారు.