తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినంను పురస్కరించుకుని ఉద్యోగులు కొత్తగూడెం కలెక్టరేట్ వరకు భారీ బైక్ ర్యాలీ సోమవారం నిర్వహించారు.సీపీఎస్ ను రద్దు చేసి తిరిగి ఓపిఎస్ ను పునరుద్దరించాలని నినాదాలు చేశారు. ఈసందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.... రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 206 సంఘాల భాగస్వామ్య పక్షంలో పెన్షన్ విద్రోహ దినం చేపడుతున్నామని అన్నారు.