భారీ వర్షాల కారణంగా ఏర్పడుతున్న వరద పరిస్థితుల దృష్ట్యా ప్రజల రక్షణ కొరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల గోదావరి నది తీరంలో, మాతా శిశు ఆసుపత్రి, రామ్ నగర్ ప్రాంతాలలో వరద పరిస్థితిని డి.సి.పి.భాస్కర్,అధికారుల లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు లోనికి 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరిందని తెలిపారు. లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల నుండి 27 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి రక్షణ చర్యలు చేపట్టరు