అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఫుట్బాల్ గ్రౌండ్ సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం జరిగిన కార్యక్రమంలో ముందుగా టంగుటూరి ప్రకాశం పంతులు గారి చిత్ర పటానికి పెన్షనర్ల సంఘం అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయిబాబు, అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణాంబలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టంగుటూరి పంతులు ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడన్నారు. చిన్న తనము నుంచి న్యాయవాది కావాలనే ఆశయంతో కష్టపడి లా పట్టా పుచ్చుకున్నారన్నారు.