శంషాబాద్ విమానాశ్రయం ప్రధాన రహదారిలో రెండు కార్లు బోల్తా కొట్టాయి. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. విమానాశ్రయం నుంచి వస్తుండగా కార్లు అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ట్రాఫిక్ నిలిచిపోగా, పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టారు.