కనిగిరి పట్టణంలోని గార్లపేట రోడ్డు, కాశిరెడ్డి బజార్, పామూరు రోడ్డులో ఉన్న సచివాలయాలను కనిగిరి మున్సిపల్ కమిషనర్ పిల్లి కృష్ణమోహన్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా సచివాలయాల్లోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం సచివాలయాల సిబ్బందితో మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ... సచివాలయాల సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలన్నారు. విధులకు డుమ్మా కొట్టే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.