గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో ఆకస్మిక మరణాలకు కారణాలను గుర్తించేందుకు ప్రభుత్వం శాంపిల్స్ సేకరణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో శ్రీ బయో ల్యాబ్స్ బృందం సోమవారం గ్రామంలో పర్యటించింది. ప్రజలు వినియోగిస్తున్న చెరువు నీరు, బోరు నీరు, మట్టి నమూనాలను సేకరించి, వాటిని పరీక్షల కోసం తీసుకెళ్లారు. రెండు రోజుల్లో శాంపిల్స్ నివేదికలు వస్తాయని అధికారులు వెల్లడించారు.