వినాయక చవితి పర్వదినం సందర్భంగా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి బుధవారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ప్రతిష్టించిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ పద్ధతిలో గణపతి వ్రతాన్ని చేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజల సకల శుభకాంక్షల కోసం ప్రార్థించారు. వినాయక చవితి ప్రజలందరినీ ఏకం చేసే ఆధ్యాత్మిక పర్వదినమని, విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొని, ప్రతి ఒక్కరి జీవితం అభివృద్ధి పథంలో సాగేలా కోరుకుంటున్నానని ఆయన అన్నారు.