అరకులోయ మండలంలో కాఫీ తోటలకు పట్టిన బెర్రీ బోరర్ తెగులుతో డీలా పడ్డ రైతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలని అరకులోయ ఎమ్మెల్యే మత్స్యలింగం కోరారు. కాఫీ కు కేజీకి 50 రూపాయలు ఎకరానికి 20 వేలు నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రతి ఒక్కరు గుర్తించమని మరి అటువంటి రైతులకు తూతూ మంత్రంగా పరిహారాలు ప్రకటించడం సభకు కాదని అన్నారు. రైతులకు మద్దతు ధర ఏవిధంగా ఉందో ఆ రకంగా నష్టపరిహారం అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం డిమాండ్ చేశారు.