ఇందిరా మహిళా శక్తి కింద ఎరువులు ఫర్టిలైజర్ దుకాణాల ఏర్పాటు చేసుకునే అవకాశం పొందిన మహిళలు వ్యాపారంలో రాణించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో ఆయన మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తేజశ్రీ గ్రామైక్య సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఎరువులు, విత్తనాల దుకాణాన్ని ప్రారంభించుకోవడం జరిగింది అని తెలిపారు. ఎరువులు, పురుగుల మందుల దుకాణాలు ఏర్పాటు రాష్ట్రంలోనే ప్రథమమని వెల్లడించారు. మహిళా సంఘాల బాధ్యులు ప్రణాళిక ప్రకారం నిర్వహించి రైతులకు న్యాయమైన విత్తనాలు ఎరువులు పురుగుల మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులు తమ