రెంజల్ మండలంలో నెలకొన్న వరద నష్టంపై AIUKS, AIPKMS, CPIML బృందం పరిశీలన చేసింది. ఈ సందర్భంగా AIUKS రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ మాట్లాడుతూ.. గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలు, భారీ వరదలు రావడంతో బోర్గం, తాడ్ బిలోలి, నీలా గ్రామాల్లో పంట భూములు కoదకుర్తి గ్రామంలో ఇళ్లలోకి నీరు రావడం వలన నష్టం జరిగిందన్నారు. ఈ గ్రామాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే వారిని ఆదుకొని సొయాకు 70వేలు, వరికి 50వేల నష్టపరిహారం ఇవ్వాలని, రైతులకు మనో దైర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేసారు. గ్రామాల్లో అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులను అందిస్తూ, హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలన్నారు.