రాజవొమ్మంగి మండలంలో జ్వరాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రజలు ఎవరు అధైర్య పడవద్దని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి అన్నారు. లాగరాయిలో జ్వరంతో జనని అనే మహిళ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చేరుకుని మృతురాలికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మృతురాలి కుమారుడు సూర్య దీక్షిత్ (7) విద్యాభ్యాసం మొత్తం తామే భరిస్తామన్నారు. ఆ కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు.