పామూరు పట్టణంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని శ్రీ విజ్ఞేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ విజ్ఞేశ్వర స్వామి గ్రామోత్సవ కార్యక్రమాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. విగ్నేశ్వర స్వామి ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. పట్టణంలోని పురవీధుల్లో గ్రామోత్సవం సాగుతుండగా మహిళలు చే నిర్వహించిన కోలాట భజనలు కార్యక్రమానికి హాజరైన భక్తులను విశేషంగా అలరించాయి. భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.