నల్గొండ జిల్లా, హాలియా పట్టణ కేంద్రంలో మహిళ మెడలో నుండి పుస్తెలతాడు చోరీ చేసిన ఇద్దరు చైన్స్ స్నాచర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం మధ్యాహ్నం హాలియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిలియా పట్టణంలో మహిళ మెడలో నుండి కల్లూరి బ్రహ్మారెడ్డి, మూల మాధవరెడ్డి అనే ఇద్దరి నిందితులు ఈ చోరీకి పాల్పడినట్లు తెలిపారు. వారిని అరెస్టు చేసి వారి వద్ద నుండి మూడు తులాల పుస్తెలతాడు, ఒక బైక్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.