ధర్మవరం పట్టణం చెరువు కట్ట వద్ద సాకే రామాంజనేయులు (43) అనే వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మృతుడు వైయస్సార్ కాలనీలో ఉంటూ ధర్మవరం వచ్చి బేల్దారి పని చేస్తూ జీవిస్తుంటాడని తెలిపారు.ధర్మవరం సాయి నగర్ లో ఉన్న తన అమ్మ ఇంటికి వచ్చి ఆదివారం సాయంత్రం బహిర్భూమికి చెరువు వద్దకు వెళ్లి పొరపాటున చెరువులో పడి మృతి చెందాడు.సోమవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.