రాయదుర్గం పట్టణంలో వినాయక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం గణనాయకులను ఊరేగింపుగా తీసుకెళ్లి మండపాల్లో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని వినాయక సర్కిల్, బళ్ళారి రోడ్డులోని గంగమ్మ బావి, ఓభుళాచారి రోడ్డులో కానిపాక వినాయక, చత్రపతి శివాజీసమేత నినాయక, నేతాజీ రోడ్డులో నటరాజ వినాయక మండపాల్లో వినాయకుడిని దర్శించునేందుకు సాయంత్రం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. పోలీసులు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు కణేకల్లు, బొమ్మనహాల్, డి.హిరేహాల్, గుమ్మగట్ట మండలాల్లోనూ వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.