నల్గొండ జిల్లా, తిరుమలగిరి సాగర్ మండలం, అల్వాల గ్రామం వద్ద నాగార్జునసాగర్ ఎడమ ప్రమాదకరంగా మారింది. కాల్వకు చేపట్టిన రైలింగ్ పనులు వరద ప్రవాహానికి కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు ఏ క్షణంలో గండిపడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతూ సోమవారం సాయంత్రం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. నాసిరకం పనులు చేయడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని వాపోయారు. గతంలో వేంపాడు వద్ద ఎడమ కాలువకు గండిపడి వేల ఎకరాలలో పంటలు కొట్టుకుపోయిందని, అదే పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరారు.