సిరిసిల్ల పట్టణంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృశ్య ఉప్పొంగుతున్న మానేరు నది. మానేరు ఎగువ నర్మల జలాశయం నిండుకొని గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగి మానేరు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ ప్రవాహాన్ని వీక్షించేందుకు పట్టణ ప్రజలు తంగళ్ళపల్లి వంతెన పై భారీగా చేరుకుంటున్నారు. మహిళలు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.