రెంజల్ మండలంలోని తాడ్బిలోలి, బోర్గం, కందకుర్తి, నీల గ్రామాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పంగి ప్రవహించి పొంగి పంట పొలాలు నీట మునిగాయి.అనేక నివాస గృహాల్లోకి వరద నీరు వచ్చి చేరగా, రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో బోధన్ ఎమ్మెల్యే,మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి వరద బాధిత గ్రామ గ్రామాల్లో పర్యటించారు. నీట మునిగి దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించి, రైతులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. వీలైనంత త్వరగా విద్యుత్ లైన్లను సరిచేయాలని, రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.