ప్రేమ విఫలం కావడంతో 3 రోజుల క్రితం పురుగు మందు తాగిన యువతి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తాళ్లపల్లికి చెందిన సక్కుబాయి (21) ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. లవ్ ఫెయిల్ అయ్యి పురుగు మందు తాగగా.. గాంధీకి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.