యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. పనులన్నీ వదులుకొని తెల్లవారు జామునుంచే యూరియా కోసం ఎదురు చూస్తున్నారు .సూర్యాపేటలో మన గ్రోమోర్ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు క్యూ కట్టారు యూరియా లేక పంటలు పండే పరిస్థితి లేదని వాపోయారు. గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది...........