CMRF పథకం పేద ప్రజలకు గొప్ప వరమని రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.రుద్రంగి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో అర్హులైన 11 మంది లబ్ధదారులకు 4 లక్షల విలువ గల CMRF చెక్కులను సోమవారం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్‌గా మారిందన్నారు..వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని రాష్ట్రానికి సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షలనుంచి రూ.10లక్షలకు పెంచినట్లు గుర్తు చేశారు