అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని 25 వార్డులలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని గుత్తి మున్సిపల్ కమిషనర్ బి.జబ్బార్ మియా ఆదేశించారు. గుత్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు, శానిటేషన్ కార్యదర్శులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలోని సచివాలయాల పరిధిలో ప్రతి శుక్రవారం ఫ్రైడే-డ్రైడే, ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ లను చేపట్టాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు.