అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో గల కశింకోట మండలం బయ్యవరం గ్రామం సాగర్ సిమెంట్ కంపెనీ వద్ద సోమవారం జరిగిన ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. కూరగాయల లోడుతో అనకాపల్లి వైపుగా వెళుతున్న లారీని ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఢీకొంది. ద్విచక్ర వాహనదారుడు పైనుంచి లారీ వెళ్లగా శరీరం రెండు భాగాలుగా చీలిపోయింది. కశింకోట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.