ములుగు జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. పస్రా -తాడ్వాయి మధ్యలోని మండలతోగు వద్ద జలగలంచవాగు ఉద్ధృతంగా రోడ్డు మీద నుంచి ప్రవహిస్తోంది. ఈ మేరకు వాగు ఉద్ధృతిని నిన్న బుధవారం రోజున రాత్రి 10 గంటలకు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీశ్ ఐపిఎస్ పరిశీలించారు. ఇరువైపులా వరద తగ్గే వరకు వాహనాల రాకపోకలను నిషేధించాలని స్థానిక పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నం చేయొద్దని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.