ఏడు నెలల జీతాలు, 30 నెలల పీ ఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కళ్యాణ దుర్గం లోని శ్రీ రామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు గురువారం కంచాల కొడుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కళ్యాణ దుర్గం లోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద నుంచి టీ సర్కిల్ వరకు వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు. తిరిగి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడ బైఠాయించి కంచాలు కొడుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు, జిల్లా సహాయ కార్యదర్శి అచ్యుత్ ప్రసాద్ మాట్లాడారు. 33 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.