ఇంటి ముందు పార్క్ చేసిన సాంట్రో కారును అర్థరాత్రి దొంగలు అపహరించారు. గుమ్మడిదల మున్సిపాలిటీ అన్నారం గ్రామానికి చెందిన కారు యజమాని కుమ్మరి అంజనేయులు గుమ్మడిదల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత వారం రోజులుగా గ్రామంలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగలు కారు ఎత్తుకెళ్లిన దృశ్యలు సీసీలో నమోదయ్యాయి.