సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్ర, నిమజ్జనం కార్యక్రమాలు అత్యంత ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. గణేష్ ఉత్సవాల నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి, జిల్లా పోలీస్ లకు సహకరించిన ప్రజలకు, ఉత్సవ కమిటీలకు, భక్తులకు, ముఖ్యంగా సమయ స్పూర్తి చూపిన యువతకు ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు. బందోబస్తు నిర్వహించిన పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.