మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలపై గణనాథుడి ఆశీస్సులు ఉండాలని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని శివశక్తి నగర్ ప్రాంతంలో మాజీ కౌన్సిలర్ తిరుపతమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి మండపం వద్ద ఆయన ప్రత్యేక పూజలు చేశారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే దేవుడైన గణపతి ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని కోరుకున్నారు.