కరీంనగర్ రామచంద్ర పూర్ కాలనీలో అక్రమ ఓట్లు వున్న మాట నిజం కాదా అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ లో మంగళవారం మీడియా సమావేశంలో అన్నారు.ఒక రేకుల షెడ్డులో ఒక చిన్న ఇంట్లో 30 ఓట్లు ఉన్నాయని, ఓకే ఇంటి నెంబర్ పై 80 ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. చూస్తే ఆ ఇంట్లో ఎవరూ ఉండరని అన్నారు.బండి సంజయ్ ఓటు చోరీ చెయ్యకపోతే ఈ ఓట్లు ఎక్కడివి అని ప్రశ్నించారు. టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ, సమాధానం చెప్పలేక మహేష్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారని అన్నారు. నీకు చాతనైతే ఓటు చోరీ చేయకపోతే నిరూపించుకోవాలని కితబు పలికారు.