కళ అనేది కేవలం కళ కోసమే కాదని, అది ప్రజల కోసమని నమ్మిన వ్యక్తి ప్రజాకవి 'ఆరుద్ర' అని రచయిత, విమర్శకులు మేడిపల్లి రవికుమార్ అన్నారు. శనివారం నగరంలోని పౌర గ్రంథాలయంలో సాహిత్య అకాడెమీ, రైటర్స్ అకాడెమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరుద్ర శత జయంతి (భాగవతుల సదాశివశంకర శాస్త్రి) వేడుకల సదస్సు ఘనంగా జరిగింది. ప్రారంభమైంది. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ 'పుట్టినరోజు పండుగ అందరికీ, అది పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే' అని డాక్టర్ సి.నారా యణరెడ్డి రాశారని, అక్షరాలా ఆరుద్రకి వర్తిస్తుం దన్నారు. కవిత కోసం పుట్టానని, సామాజిక క్రాంతి కోసం కలం పట్టానని ఆరుద్ర అన్నారన్నారు