సోమవారం సాయంత్రం ధరూర్ మండలంలోని కుర్వ వీధి నుండి స్థానిక సమస్యలపై సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థను అన్ని విధులలో, సక్రమంగా ఏర్పాటు చేయకపోవడం వల్ల మురుగునీరు రోడ్లపై ప్రవహించి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని, కుటుంబాల మధ్య తగాదాలకు, ప్రమాదాలకు కారణం అవుతుందన్నారు.