వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాలు ఈనెల 8, 9, 10 తేదీలలో కడప నగరంలో జరుగుతున్న నేపథ్యంలో 8వ తేదీన జరిగే భారీ ప్రదర్శన బహిరంగ సభను పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలంటూ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పి వెంకట్ తెలిపారు ఆదివారం కడప ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్విర్యం చేసే రకంగా కుట్ర పన్నుతున్నదని ఆయన తెలిపారు.