వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన ఆర్డీవో కార్యాలయాల వద్ద తలపెట్టిన ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు రైతన్నకు బాసటగా వైయస్సార్సీపి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉండి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ పివిఎల్ నరసింహారాజు పిలుపునిచ్చారు. ఉండి నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. ఉండి నియోజకవర్గంలో ఉన్న రైతులు, పార్టీ శ్రేణులు జయప్రదం చేసి రైతులకు అండగా ఉండాలని అన్నారు.