వరద బాధితులను రక్షించేందుకు ప్రత్యేక వైమానిక దళ హెలికాప్టర్ ను పంపించాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి విజ్ఞప్తి చేశారు. బుధవారం సాయంత్రం 7గంటలకు ఆయనతో ఫోన్లో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలో వరదల్లో 30 మంది చిక్కుకుపోయారని వెల్లడించిన కేంద్ర మంత్రి. బాధితులను కాపాడేందుకు ప్రత్యేక వైమానిక దళ హెలికాప్టర్ ను పంపించాలని కోరిన బండి సంజయ్. బండి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాజ్ నాథ్ సింగ్ బాధితులను కాపాడేందుకు ప్రత్యేక వైమానిక దళ హెలికాప్టర్ ను పంపాలని హకీంపేటలోని డిఫెన్స్ అధికారులను ఆదేశించారు.