యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండల పరిధిలోని వస్తా కొండూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం అమ్మ మాట-అంగన్వాడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిడిపిఓ జోష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలకు 30 నెలలు నిండిన వెంటనే పూర్వ ప్రాథమిక విద్య గురించి అంగన్వాడిలో చేర్పించాలని సూచించారు. బిడ్డకు ఆటపాటలతో అందించే విద్య ద్వారా అన్ని అభివృద్ధిలో జరుగుతాయని తెలిపారు. అనంతరం అంగన్వాడి కేంద్రంలో ఉన్న టీచింగ్ మెటీరియల్ను పరిచయం చేశారు.