పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా జిల్లాలో ఒక్కో ఉద్యోగి ఒక్కో మొక్క కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా 15వేల మొక్కలను నాటడం జరిగిందని జిల్లా కలెక్టర్ కే.హైమావతి తెలిపారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ' ఏక్ పేడ్ మా కే నామ్' స్ఫూర్తితో జిల్లా కలెక్టర్ ఆలోచన మేరకు సిద్దిపేట జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వారి తల్లి పేరు మీద ఒక మొక్కను నాటే వినూత్న కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరీమా అగ్రవాల్ పర్యవేక్షణలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రూపకల్పన చేసి మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఒక్కో ఉద్యోగి ఒక్కో మొక్కను నాటే కార్యక్రమం చేపట్టారు.