పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి లో మంగళవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పదహారవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. బ్రాహ్మణపల్లికి చెందిన వైకాపా నాయకులు మహిళా కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహం వద్దకు చేరుకొని పూలమాలలు వేసి నివాళులర్పించి జోహార్ వైయస్సార్ అంటూ నినాదాలు చేశారు.